Naveen Case : నవీన్ హత్య కేసులో అనూహ్య మలుపు.. నిహారిక, హాసన్ అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక మలుపు. ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.(Abdullapurmet Naveen Case)
- Naveen
- Published On : March 6, 2023 / 07:09 PM IST
Naveen Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక, అతడి స్నేహితుడు హాసన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు ఆ ఇద్దరిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో చెప్పాడు నిందితుడు హరిహరకృష్ణ. దీంతో పోలీసులు యువతి నిహారికను ఈ కేసులో నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిహారికతో పాటు హరిహరకృష్ణ స్నేహితుడు హాసన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హాసన్, ఏ3గా నిహారిక పేర్లు చేర్చారు.
నవీన్ హత్య తర్వాత నిహారిక హరిహరకృష్ణకు రూ.1500 ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ హత్య కేసులో ప్రియురాలు నిహారికను నిందితురాలిగా చేర్చారు పోలీసులు. నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ ను హరి హత్య చేశాడని తెలిసినా నిహారిక.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అంతేకాదు.. హరిహరకృష్ణతో పలుసార్లు వాట్సాప్ చాటింగ్ చేసినట్టు గుర్తించారు. నవీన్ హత్యకు నిహారిక పరోక్షంగా హరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.(Abdullapurmet Naveen Case)
Also Read..Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం
ఈ కేసులో యువతి అరెస్ట్ కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఆధారాలు సేకరించారు. నవీన్ హత్య కేసులో ప్రియురాలు నిహారిక ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. నిహారికతో పాటు హరి స్నేహితుడు హాసన్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నవీన్ హత్య గురించి తెలిసినా.. నిహారిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో హరి స్నేహితుడు హాసన్ కూడా పూర్తిగా సహకరించాడు. ఈ మేరకు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ లు సేకరించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత హరి.. తన మిత్రుడు హాసన్ రూమ్ కి వెళ్లాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను వాష్ చేసుకున్నాడు. నవీన్ ను హత్య చేసినట్లు హాసన్ కి చెప్పాడు. అయినప్పటికీ.. హాసన్.. నవీన్ హత్య విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని కూడా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.(Abdullapurmet Naveen Case)
Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్
