Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

Abdullapurmet Naveen Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వారి పేర్లు పోలీసులకు చెప్పడానికి హరిహరకృష్ణ మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. తనను మాత్రమే విచారించాలని, చట్టం తనకు తెలుసునని పోలీసులతో హరిహరకృష్ణ వాదిస్తున్నట్లు సమాచారం. చట్టంలో లొసుగులే తనను బయటకు తీసుకొస్తాయన్న హరిహరకృష్ణ, ఇక లొంగిపోయాను కాబట్టి తనకు జీవిత కాల శిక్ష పడే అవకాశం లేదనే ధీమాలో హరిహరకృష్ణ ఉన్నట్లు కనిపిస్తోంది. హత్య, చట్టాలపై సోషల్ మీడియా ద్వారా హరిహరకృష్ణ అవగాహన పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read..Abdullapurmet Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. హరిహర కృష్ణతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. యువతి పాత్రపై ఆరా

నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను రంగారెడ్డి కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిన్న(మార్చి 3) సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ(మార్చి 4) రెండో రోజు విచారించారు. సరూర్ నగర్ లోని ఎల్బీనగర్ ఎస్వోటీ ప్రధాన కార్యాలయంలో హరిని విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో హరి నోరు మెదపడం లేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నం హరిహరకృష్ణ చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Also Read..Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

సోషల్ మీడియా, యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి పోస్టుమార్టం ఏ విధంగా చేయాలి, శరీరంలోని అవయవాలు ఏ విధంగా బయటకు తీయాలి అనేది చూసి, ఆ వీడియోల ద్వారా నవీన్ ను అతి దారుణంగా చంపి, అతడి శరీర భాగాలను వేరు చేసి వాటి ఫొటోలు తీసి తన ప్రియురాలికి పంపించాడు హరి. ఇదంతా యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ వీడియోలు చూసి ఈ విధంగా ప్రవర్తించినట్లు పోలీసులు కొంత ఎవిడెన్స్ సేకరించారు.(Abdullapurmet Naveen Case)

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

మరోవైపు చట్టం పట్ల నిందితుడికి కొంత అవగాహన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లొంగిపోయాను కాబట్టి తనకు ఉరిశిక్ష పడదు అనే అభిప్రాయాన్ని కూడా నిందితుడు పోలీసుల ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఈ హత్య కేసుకి సంబంధించి తనను మాత్రమే ప్రశ్నించాలి, ఇంకెవరినీ ప్రశ్నించకూడదని, మరెవరినీ ఇన్వాల్వ్ చేయకూడదని పోలీసుల ఎదుట హరిహరికృష్ణ కొంత మొండికేసినట్లు సమాచారం తెలుస్తోంది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు నిందితుడు సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది.

Also Read..Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం