Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

krishna

Abdullapurmet Incident : హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హత్య ఎలా చేయాలో హరిహర కృష్ణ యూట్యూబ్ లో సెర్చ్ చేశారని పేర్కొన్నారు. హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలపై గూగుల్ లో సెర్చ్ చేశాడు.

ప్రియురాలు దక్కదేమో అని నవీన్ హత్యకు హరి హర కృష్ణ కుట్ర పన్నారని పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారం పార్టీ పేరుతో పిలిచి నవీన్ ను హరి హర కృష్ణ హత్య చేశారు. హత్య చేసిన తర్వాత హరి ఫోన్ నుంచి 10 మందికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. స్నేహితుడికి హత్య విషయాన్ని చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హరి, నవీన్, ప్రియురాలి వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు రీ ట్రైవ్ చేశారు.

Abdullapurmet Incident : నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు

నవీన్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హరి హర కృష్ణ పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని తేలింది. నవీన్, హరి హర కృష్ణ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఇద్దరికి బేధాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. దీంతో నవీన్ హత్య చేయాలని నిర్ణయించుకున్న హరి హర కృష్ణ మూడు నెలల నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరించాడు. హరి హర కృష్ణ హ్యత చేసిన తీరును చూసిన పోలీసులే విస్తుపోయారు.

ఓ షాపింగ్ మాల్ లో రెండు నెలల క్రితమే కత్తి కొనుగోలు చేసిన అతడు నవీన్ ను ఊపిరాడకుండా గొంతు నులిమి హత మార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. నవీన్ సెల్ ఫోన్ ధ్వంసం చేశాడు. సైకోలా మారి నవీన్ తల, మొండెం వేరు చేయడంతోపాటు గుండె చీల్చి మర్మాంగాలను కోసేశాడు. పొట్ట మొత్తం కోసి పేగులు బయటకు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

హరి హర కృష్ణ మానసిక స్థితి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ వెబ్ సీరిస్ లు, యూట్యూబ్ లు చూసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. నిందితుడికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నగరంలోని ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. హరి హర కృష్ణ కనిపించడం లేదంటూ ఆయన బావ లక్ష్మీ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే కుత్బుల్లాపూర్ మెట్ పోలీసుల ఎదుట హరి హర కృష్ణ లొంగిపోయాడు.

Abdullapurmet Incident : అమ్మాయి కోసం స్నేహితుడి హత్య కేసు.. చంచల్‌గూడ జైలుకి నిందితుడు

అనంతరం హరి హర కృష్ణను పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. హరి హర కృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు హరి హర కృష్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కాగా, ఈ దారుణ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు కలకలం రేపుతోంది.