Abdullapurmet Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. హరిహర కృష్ణతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. యువతి పాత్రపై ఆరా

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Abdullapurmet Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. హరిహర కృష్ణతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. యువతి పాత్రపై ఆరా

NAVEEN (1)

Abdullapurmet Naveen case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నవీన్ హత్య వెనుక ఓ యువతి పాత్ర కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి హత్య జరిగిన రోజు దగ్గర నుంచి ప్రతీది హరి హర కృష్ణ యువతికి ఫోన్ చేయడం, వాట్సాప్ లో పిక్స్ షేర్ చేశారు. పోలీసులు యువతిని కూడా విచారణ చేయాలనుకుంటున్నారు.

నవీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహితుడు నవీన్ ను హరిహరకృష్ణ చంపేశాడు. 3 నెలల క్రితమే నవీన్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. 2 నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తి కొన్నాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను మర్డర్ చేశాడు హరిహరకృష్ణ. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరి మద్యం తాగారు. యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

Abdullapurmet Incident : అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ కాల్, యువతి ఏమని చెప్పిందంటే..

ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్ ను హరి హత్య చేశాడు. తర్వాత కత్తితో నవీన్ శరీర భాగాలు వేరు చేశాడు. శరీర భాగాలను బ్రాహ్మణపల్లి పరిధిలో పడేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న హసన్ అనే ఫ్రెండ్ ఇంటికి హరి వెళ్లాడు. అక్కడ స్నానం చేశాక హత్య విషయాన్ని హరి హసన్ కు చెప్పాడు. మరుసటి రోజు నవీన్ మర్డర్ విషయాన్ని ప్రియురాలికి కూడా నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో తిరిగాడు. ఫిబ్రవరి 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. హత్య చేసిన స్పాట్ కి వెళ్లాడు.

పారేసిన శరీర విడి భాగాలను సేకరించాడు. వాటన్నింటిని తగలబెట్టాడు. అదే రోజు సాయంత్రం పోలీసులకు నిందితుడు హరిహరకృష్ణ లొంగిపోయాడు. నవీన్, హరి ఇద్దరూ స్నేహితులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అదే ఇంతటి దారుణానికి దారితీసింది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. నవీన్ కారణంగా ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుందోనని హరి భయపడ్డాడు.

Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

నవీన్ ను లేపేసి ప్రియురాలిని దక్కించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు. పార్టీ పేరుతో నవీన్ ను పిలిపించి మర్డర్ చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను వేరు చేసి సైకోలా ప్రవర్తించాడు. నవీన్ వేళ్లు, పెదాలు, మర్మాంగాలు కోసి వాటి ఫొటోలు తన ప్రియురాలికి పంపాడు. అంతేకాకుండా గుండెను బయటకు తీశాడు. తలను కూడా వేరు చేశాడు. హరిహరకృష్ణ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.