Abdullapurmet Incident : అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ కాల్, యువతి ఏమని చెప్పిందంటే..

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది.

Abdullapurmet Incident : అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ కాల్, యువతి ఏమని చెప్పిందంటే..

Abdullapurmet Incident : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది. నవీన్ కనిపించకపోవడంతో యువతి అలాగే ఆమె సోదరుడితో మాట్లాడాడు. నవీన్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆరా తీశాడు నవీన్ ఫ్రెండ్. అయితే, తనకు ఏమీ తెలియదని యువతి, ఆమె సోదరుడు చెప్పారు.

ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందోననే భయంతో ఫ్రెండ్ నవీన్ ను హరిహర కృష్ణ అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ఈ ఘోరం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హత్య ఎలా చేయాలో హరిహర కృష్ణ యూట్యూబ్ లో సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గూగుల్ లో సెర్చ్ చేసినట్లు గుర్తించారు.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

నవీన్ కారణంగా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమో అనే అనుమానంతో నవీన్ హత్యకు కృష్ణ కుట్ర పన్నాడని పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే పార్టీ పేరుతో పిలిచి నవీన్ ను హరి హర కృష్ణ మర్డర్ చేశాడు. హత్య చేసిన తర్వాత హరి ఫోన్ నుంచి 10 మందికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. స్నేహితుడికి హత్య విషయాన్ని కృష్ణ చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హరి, నవీన్, అమ్మాయి వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు రిట్రైవ్ చేశారు.

నవీన్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కృష్ణ పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని తేలింది. నవీన్, హరి ఇద్దరూ ఒక కాలేజీలో చదువుకుంటున్నారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే, ఒకే అమ్మాయిని ప్రేమించారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయిన దక్కించుకునేందుకు నవీన్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్న హరి 3నెలల నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరించాడు. హత్య తర్వాత హరి తీరును చూసిన పోలీసులే విస్తుపోయారు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరి

2 నెలల క్రితమే ఓ షాపింగ్ మాల్ లో కత్తి కొనుగోలు చేసిన హరి.. నవీన్ ను ఊపిరాడకుండా గొంతు నులిమి హత మార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. నవీన్ సెల్ ఫోన్ ధ్వంసం చేశాడు. సైకోలా మారి నవీన్ తల, మొండెం వేరు చేయడంతోపాటు గుండె చీల్చి మర్మాంగాలను కోసేశాడు. పొట్ట మొత్తం కోసి పేగులు బయటకు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హరి హర కృష్ణ మానసిక స్థితి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ వెబ్ సీరిస్ లు, యూట్యూబ్ చూసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రేమించిన యువతికి స్నేహితుడు నవీన్ దగ్గర అవడాన్ని నిందితుడు హరి జీర్ణించుకోలేకపోయాడు. నవీన్ పై కక్ష పెంచుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం పార్టీ పేరుతో పిలిపించాడు. నవీన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత అతడి శరీర భాగాలను వేరు చేశాడు. గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరు చేసి వాటి ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. నవీన్ మర్మాంగాలను కూడా కోసేశాడు.

ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను బయటకు తీసి ఆ ఫొటోను కూడా పంపించాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు.