Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ 10 టీవీ చేతికి చిక్కింది. సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.

Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

SATVIK

Satvik case : శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ 10 టీవీ చేతికి చిక్కింది. సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులకు తట్టుకోలేకపోయానని తాను ఉంటున్న హాస్టల్ లో వీరు నలుగురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని తెలిపాడు. వీరి వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాని సాత్విక్ సూసైడ్ లో పేర్కొన్నారు.

తనను వేధించిన ఈ నలుగురిపై యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ఇలాంటి సంఘనలు మళ్లీ ఎవరికి జరుగకుండా ఉండాలంటే తాను రాసిన సూసైడ్ నోట్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పొందుపర్చారు. వీరికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సాత్విక్ సూసైడ్ నోట్ లో కోరారు.
చివర్లలో అమ్మానాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సూసైడ్ లెటర్ లో సాత్విక్ స్పష్టంగా పేర్కొన్నారు. అమ్మానాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి అని లెటర్ లో పేర్కొన్నారు.

Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు

మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదన్నారు.  కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో క్లియర్ గా వివరించాడు. ఇంచార్జ్ ప్రిన్సిపల్, లెక్చరర్, పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోయానని చెప్పారు.

మరోవైపు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేకే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు, స్నేహితులు అంటున్నారు. ప్రతి చిన్న విషయానికి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ సూసైడ్ నోట్ పై పోలీసులు ఇప్పటికే సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.