Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం

రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం

ANUSHA

Ramanthapur : కొద్ది రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చదువు ఒత్తిళ్లు విద్యార్థుల చావులకు కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే సాత్విక్, ఇప్పుడు అనూష ఆత్మహత్య చేసుకునన్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పిల్లలు ప్రయోజకులవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తుంటే.. పిల్లలు తీసుకునే కఠిన నిర్ణయాలు మాత్రం కన్నవారికి కడుపు కోతలే మిగిలిస్తున్నాయి.

రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. అనూష 2020 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసి అప్పటి నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతున్నారు. రెండు సార్లు ఎగ్జామ్స్ రాసిన సీటు రాలేదు. ఇక మూడో సంవత్సరం నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారు. కానీ నీట్ పై ఆమెకు ఆసక్తి లేకపోయినా అదే చదవాలని తల్లిదండ్రులు మందలించారు.

Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు

తనకు ఆసక్తి లేకపోయినా చదవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అనూష మనస్తాపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున తండ్రి రవి ప్రసాద్ డ్యూటీకి వెళ్లాక అనూష ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. ఉదయం తల్లి చూడగా ఇంట్లో అనూష్ కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్తకు సమాచారం అందించారు. అనూష తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

చుట్టుపక్కలంతా వెతికారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో కూతురు అదృశ్యంపై ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చివరకు రామంతాపూర్ చెరువులో అనూష మృతదేహం లభించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.