Kolkata RG Kar Doctor Case : కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు..
సీబీఐ 120 మంది సాక్షులను విచారించి సంజయ్ రాయ్ దోషి అంటూ అభియోగాలు చేసింది.

Kolkata RG Kar Doctor Case : కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది కోల్ కతా సీల్దా కోర్టు. సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. అప్పటివరకు సంజయ్ కి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
గత ఏడాది ఆగస్టు 9న వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే, తర్వాతి రోజే సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీబీఐ 120 మంది సాక్షులను విచారించి సంజయ్ రాయ్ దోషి అంటూ అభియోగాలు చేసింది. సీబీఐ ఆధారాలతో కోర్టు కూడా సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది.
కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనలో తీర్పును ప్రకటించింది కోర్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేయబోతోంది ప్రత్యేక కోర్టు. కాగా, ఈ కేసులో తనను ఇరికించారంటూ సంజయ్ రాయ్ కోర్టులో చెప్పాడు. అయినప్పటికీ ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది కోర్టు. సోమవారం భారత న్యాయ సంహితలోని సెక్షన్స్ ఆధారంగా రాయ్ కి శిక్షను ఖరారు చేయబోతోంది సీబీఐ ప్రత్యేక కోర్టు.
గత ఏడాది కోల్ కోతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో 31ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది. ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో వైద్యుల భద్రత కోసం ప్రత్యేక నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది.
Also Read : వాడు వీడేనా? సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్..