చైనాలో బొగ్గుగనిలో పేలుడు 15 మంది మృతి

  • Publish Date - November 19, 2019 / 07:07 AM IST

చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది.  బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా  మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.  11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం  ఈఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 35 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు  తెలిపారు.  రక్షణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు పేర్కొన్నారు.