Couple Ends Life
Love Couple Suicide : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు. ఇంట్లో వాళ్లకు తెలీయకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారు.
ఇంట్లో వాళ్లకు తర్వాత చెప్పొచ్చులే అనుకున్నారు. ఏమీ తెలియనట్లు ఎవరింటికి వారు వచ్చి జీవించ సాగారు. ఈలోగా వారి పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. వీరిద్దరూ అన్నాచెల్లెళ్లవుతారని బంధువులు అనటం విని ఆ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు(24) తన సోదరి ద్వారా పరిచయం అయిన ఒకయువతి(21)తో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఇక ప్రేమ వ్యవహారం చాలు, పెళ్లి చేసుకుందామని…10 రోజుల క్రితం హైదరాబాద్ శివారులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లి జీవించసాగారు.
Also Read : Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు
ఈ క్రమంలో వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన వారి బంధువులు వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని చెప్పారు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ల వరస అవుతారని వారికి వివరించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది.
విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగుల మందుతాగి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. అది గమనించిన స్ధానికులు యువకుడిని వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమించటంతో అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు.