New Project (6)
Love married couple : రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం స్తంభంపల్లిలో దారుణం జరిగింది. ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి తండ్రిని కొట్టిచంపారు.స్తంభంపల్లి గ్రామానికి చెందిన గౌతమిని మహేశ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది.
వీరిద్దరికి పెళ్లి చేసేదే లేదని తేల్చి చెప్పారు. గౌతమికి మరో అబ్బాయితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (అక్టోబర్ 28, 2020)న ఆమెకు నిశ్చితార్థం ఉండగా.. 27వ తేదీన మహేశ్ యువతిని తీసుకొని గ్రామం నుంచి పారిపోయాడు.
దీంతో గౌతమి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు మహేశ్ తండ్రి తునికి లక్ష్మీనారాయణ(58)పై యువతీ తల్లిదండ్రులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.