Jagtial Incident : ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

ఈ ఘటనలో గాయపడ్డ యువతి కుటుంబసభ్యులకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Jagtial Incident Update

Jagtial Incident : జగిత్యాల జిల్లా తక్కలపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. యువతి కుటుంబసభ్యులపై మహేశ్ కత్తితో దాడి చేశాడు. అతడిని అడ్డుకునే క్రమంలో మహేశ్ పై బండరాయితో దాడి చేశారు. దీంతో మహేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అవగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడేళ్లుగా యువతిని మహేశ్ వేధిస్తున్నాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మృతుడు మహేశ్ తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇప్పటికే యువతి బంధువులు మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రోజున కూడా షీ టీమ్ కు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో మహేశ్ యువతి ఇంటికి వెళ్లాడు. యువతి కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. వారు కూడా ప్రతిఘటించారు. మహేశ్ కత్తితో దాడి చేయడంతో యువతి తల్లి, తాత, తమ్ముడు.. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహేశ్ పైన తిరగబడ్డారు. మహేశ్ తలపై బండరాయితో మోది చంపేశారు. ఈ ఘటనలో గాయపడ్డ యువతి కుటుంబసభ్యులకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి తాతకు ఛాతి భాగంలో తీవ్రమైన కత్తి గాయం అయ్యింది. అతడి పరిస్థితి కొంత సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రేమ పేరుతో వేధిస్తున్న మహేశ్ పై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మహేశ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ మహేశ్ తీరులో మార్పు లేదు. నిన్న కూడా షీ టీమ్స్ మహేశ్ కు కౌన్సిలింగ్ ఇచ్చాయి. పద్ధతి మార్చుకోకుంటే కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపంతో ఊగిపోయిన మహేశ్ ఇవాళ యువతి కుటుంబసభ్యులపై దాడి చేసేందుకు వెళ్లాడు. ఈ గొడవలో మహేశ్ తన ప్రాణాలు కోల్పోయాడు. యువతి కుటుంబానికి చెందిన ముగ్గురు గాయాలపాలయ్యారు. దీనిపై మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ