నదిలో పడిన బస్సు..ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, 19మంది గాయపడ్డారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళతో సహా ఆరుగురు పురుషులు ఉన్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ట్రీట్మెంట్ కోసం సమీప హాస్పిటల్ కు తరలించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో రైసన్ జిల్లా కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ్ కూడా గాయపడ్డారు. నీట మునిగిన బస్సును వెలికి తీస్తున్నారు. అయితే అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.