Maharashtra Train Incident : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. ప్రయాణికుల పైకి దూసుకెళ్లిన రైలు, 20మంది మృతి..

పట్టాలు దాటే క్రమంలో ఘోరం జరిగిపోయింది. మరోవైపు నుంచి దూసుకొచ్చిన రైలు.. పట్టాలు దాటుతున్న ప్రయాణికుల మీద నుంచి దూసుకెళ్లింది.

Maharashtra Train Incident : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో చైన్ లాగడంతో మంటలు చెలరేగాయి. దీంతో భయంతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకేశారు. అదే సమయంలో అటువైపు నుంచి వచ్చిన బెంగళూరు ఎక్స్ ప్రెస్.. ప్రయాణికుల మీద నుంచి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో 20మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

బోగిలో మంటలు చెలరేగడంతో ప్రాణ భయంతో ప్రయాణికులు బయటకు దూకేశారు. పట్టాలు దాటే క్రమంలో ఘోరం జరిగిపోయింది. మరోవైపు నుంచి దూసుకొచ్చిన రైలు.. పట్టాలు దాటుతున్న ప్రయాణికుల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఈ ప్లాన్లపై మొబైల్ డేటా ఫసక్.. కానీ, ఇలాంటి వాళ్లకు లాభం..!

రైల్లో మంటలు ఎగిసిపడుతున్నాయనే ప్రచారం ఈ ఘోర విషాదానికి దారితీసింది. రైల్లో మంటల భయంతో ప్రయాణికులు చైన్ లాగి రైలుని నిలిపివేశారు. బోగీల నుంచి కిందకు దిగారు. ట్రాక్ దాటే ప్రయత్నంలో ఉండగా.. అదే సమయంలో అటువైపు నుంచి రైలు దూసుకురావడంతో ఘోర ప్రమాదం జరిగింది.

దీనిపై రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. రైలులో మంటలు అంటుకున్నాయని అనే ప్రచారమే ఈ ఘోర విషాదానికి దారితీసింది. ఘటనా స్థలంలో భీతావాహమైన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మూడు ఆసుపత్రులకు తరలించారు.

 

Also Read : ఇదేందిది కొత్తగా ఇంకొకటి.. పిల్లలు, యువతలో సడన్‌గా నరాల జబ్బు.. లక్షణాలు ఇవే.. చెక్ చేసుకోండి!