Airtel Prepaid Plans : ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఈ ప్లాన్లపై మొబైల్ డేటా ఫసక్.. కానీ, ఇలాంటి వాళ్లకు లాభం..!
Airtel Prepaid Plans : ఇప్పుడు మీరు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే.. డేటా రీఛార్జ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Airtel Prepaid Plans
Airtel Prepaid Plans : ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. దేశంలోని రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోట్లాది మంది యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవలి ఆదేశాలకు అనుగుణంగా రూ. 509, రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్లలో మొబైల్ డేటా బెనిఫిట్స్ ఎయిర్టెల్ తొలగించింది.
ఈ రెండు ప్లాన్లలో లభించే డేటా బెనిఫిట్స్ ఇకపై ఎయిర్టెల్ యూజర్లు వినియోగించుకోలేరు. అంటే.. ఇప్పుడు మునుపటిలాగా ఎయిర్టెల్ ఈ రెండు ప్లాన్లలో ఇంటర్నెట్ లభించదు. ఎయిర్టెల్ ఇంటర్నెట్ బెనిఫిట్స్ తొలగించిన ప్లాన్ల ధర వరుసగా రూ. 509, రూ. 1999 అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు మీరు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే.. డేటా రీఛార్జ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు ఎయిర్టెల్ రూ. 509, రూ. 1999 ప్లాన్లు అత్యంత ఖరీదైనది. ఇంతకు ముందు ఈ ప్లాన్లలో అందుబాటులో ఉన్న డేటా బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509 :
ఎయిర్టెల్ రూ. 509 ప్లాన్‌లో మీకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్‌లో మీరు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి ఫ్రీ యాక్సెస్, అపోలో 24|7 సబ్స్క్రిప్షన్, ఫ్రీ హలో ట్యూన్ కూడా పొందుతారు.

Airtel Prepaid Plans
అంతకుముందు ఎయిర్టెల్ రూ. 509 ప్లాన్‌లో మీరు అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలతో పాటు 6GB డేటాను కూడా అందించింది. ఇప్పుడు డేటాను ఈ ప్లాన్ నుంచి తొలగించింది.
రూ. 569 ప్లాన్‌తో డేటా బెనిఫిట్స్ :
ఒకవేళ మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ ఫ్రీ ఎస్ఎంఎస్, కొన్నిసార్లు మొబైల్ డేటాతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం చూస్తుంటే.. అదే వ్యాలిడీటీతో వాయిస్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందించే ఉన్న రూ. 569 ప్లాన్‌ని ఎంచుకోండి. ఇందులో 6GB మొబైల్ డేటాను అందిస్తుంది.
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1999 :
ఎయిర్టెల్ రూ. 1,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా సవరించింది. ప్రస్తుతం ఎయిర్టెల్ మొబైల్ డేటా బెనిఫిట్స్ పూర్తిగా తొలగించింది. ఈ ప్లాన్‌లో ఇప్పుడు మీకు అన్లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS మాత్రమే లభిస్తాయి. ఈ రీఛార్జ్ మొత్తం వ్యాలిడీటీ 365 రోజులు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.
ఎయిర్టెల్ వినియోగదారులు ప్లాన్‌లో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24|7 సబ్స్క్రిప్షన్, ఫ్రీ హలో ట్యూన్ పొందుతారు. ఇంతకుముందు, ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో మొత్తం 24GB డేటా అందించింది. దాంతో పాటు, అన్లిమిటెడ్ కాలింగ్, 3000 ఉచిత SMS, రోజుకు 100 SMS కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్టెల్ అందించే రెండు ప్లాన్లు స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ సొల్యూషన్‌తో వస్తాయి. ఉచిత ఎస్ఎంఎస్ పరిమితిపై లోకల్, STD SMS కోసం ఒక్కో SMSకు రూ. 1, రూ. 1.5 ఛార్జ్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్లో, ట్రాయ్ దేశంలోని నెట్వర్క్ ఆపరేటర్లకు ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను అందించాలని ఆదేశాన్ని జారీ చేసింది. అయినప్పటికీ, ఎయిర్టెల్ కొత్త STV ప్లాన్లు గతంలో అందుబాటులో ఉన్న ప్లాన్లను తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది.