Mahesh Bank Fraud : సినీ ఫక్కీలో ఛేజ్ చేసి నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా

Mahesh Bank Case

Mahesh Bank Fraud : ఏపీ మహేష్ కోఆపరేటివ్అ ర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కు చెందిన చెస్ట్ ఖాతానుంచి రూ.12.93 కోట్ల రూపాయలు కాజేసిన కేసులో నిందుతుల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా వారిపై దాడి చేసి తప్పించుకునిపారిపోయాడు. అతడిని దాదాపు రెండు కిలో మీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు.

మహేష్  బ్యాంకు కు చెందిన నగదు మొదట నాలుగు ఖాతాల్లోకి బదిలీ అయ్యింది. అక్కడి నుంచి నిందితులు మరో 128 ఖాతాల్లోకి ట్రాన్సఫర్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులతోపాటు ఆ ఖాతాదారులకోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుబడిన ఖాతాదారులను ప్రాథమిక విచారణ చేయగా..కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు.

దీంతో పోలీసులు ఈశాన్య   రాష్ట్రాలతో  పాటు ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో గాలింపు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరూ   దొరకక  పోయినా ఢిల్లీ వెళ్ళిన పోలీసులకు మాత్రం ముగ్గురు ఖాతాదారులతోపాటు దళారిగా వ్యవహరించిన ఒక నైజీరియన్ ను గుర్తించారు.  సోమావారం మధ్యాహ్నం అతవి ఫ్లాట్ వద్దకు చేరుకోగా.. పోలీసులపై పిడిగుద్దులు గుద్దుతూ వారినుంచి తప్పించుకుని ఢిల్లీ రోడ్లలో పరుగులు తీశాడు.  అతడి దెబ్బలనుంచి తేరుకున్న పోలీసులు ఢిల్లీ   వీధుల్లో ఛేజింగ్ చేసి దాదాపు 2 కిలోమీటర్లు వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : YS Jagan Chiranjeevi Meeting : మరోసారి జగన్‌తో చిరు భేటీ -సినిమా టికెట్ల గొడవకు శుభం కార్డు పడనుందా !

ఇదేసమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన పోలీసు బృందాలు మరి కొంందరు ఖాతాదారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్‌ టీమ్‌ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితలను అరెస్టు చేసింది.  మరోపక్క ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

మహేష్ బ్యాంకు ఖాతాలను పక్కా ప్లాన్ తోనే నైజీరియన్లు హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హ్యాకింగ్ సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండా నైజీరియన్లు జాగ్రత్త పడ్డారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అవుతే ఆర్బీఐ‌తో పాటు ఐటీ శాఖకు రెడ్ ట్యాగ్ అలారం మోగుతుంది. రెడ్ టాగ్ మోగితే హాకింగ్ గురించి వెంటనే ఆర్బీఐకు సమాచారం వెళ్తుంది. అయితే రెడ్ ట్యాగ్ మోగకుండా నైజీరియన్లు జాగ్రత్తపడ్డారు.

వ్యాపారవేత్తల కరెంట్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకుని… రెడ్ ట్యాగ్ వెళ్లకుండా నైజీరియన్లు బ్లూ ప్రింట్ ప్లాన్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు కనుగొన్నారు. బదిలీ చేసుకున్న నగదును 128 ఖాతాల్లోకి తక్కువ మొత్తంలో మోసగాళ్లు మళ్లించారు. మోసగాళ్లు మళ్ళించిన 128 ఖాతాల యజమానులకు గుర్తించే పని లో పోలీసులు ఉన్నారు.ఇప్పటికీ 10మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నైజీరియన్లు కోసం పోలీసు వేట కొనసాగుతోంది.