Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

జార్ఖండ్ రాష్ట్రంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించి సడెన్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది...

Major Train Accident Averted: జార్ఖండ్ రాష్ట్రంలో మరో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.మంగళవారం రాత్రి న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22812) వెళుతుండగా సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో రైల్వే గేట్‌ను ట్రాక్టర్ ఢీకొంది. భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతల్దిహ్(Jharkhand) రైల్వే క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం

ట్రాక్టర్ రైల్వే ట్రాక్, గేట్ మధ్య ఇరుక్కుపోయింది.‘‘బొకారో జిల్లాలోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటును మూసివేస్తున్నప్పుడు ట్రాక్టర్ ఢీకొట్టింది. అయితే రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయింది, దీంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది’’ అని సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని అద్రా డివిజన్ డీఆర్ఎం మనీష్ కుమార్ తెలిపారు.ఈ సంఘటన రైలు 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని కుమార్ తెలిపారు.

Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు

ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, గేట్ మ్యాన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్‌ ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ జరిగిన కొద్ది రోజులకే చిన్న చిన్న ఘటనలు జరిగాయి.

ట్రెండింగ్ వార్తలు