అందరి ముందు యువకుడిని చుట్టుముట్టి చంపేసిన 12 మంది

ఎఫ్ఐఆర్‌లో 11 మంది నిందితుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న..

ARREST

రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఓ యువకుడిని 12 మంది చుట్టుముట్టి, పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.

కృష్ణానగర్‌కు చెందిన కార్తీక్ పంకజ్ అనే యువకుడు నేరానికి పాల్పడి జైలుకి వెళ్లాడు. రెండు నెలల క్రితం బెయిలుపై అతడు విడుదలయ్యాడు. బరన్ సిటీ మున్సిపాలిటీ కాలనీ ప్రాంతంలో అతడు ఉండగా దాదాపు 12 మంది అక్కడకు చేరుకుని దాడి చేశారు.

తీవ్రగాయాలపాలైన కార్తీక్ పంకజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పంకజ్ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో పంకజ్ నేరాలకు పాల్పడడంతో అతడిపై కొందరు పగ పెంచుకున్నారని పోలీసులు వివరించారు. అతడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేసుకుని వచ్చారని చెప్పారు.

పంకజ్ పై దాడి చేసిన ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశామని అన్నారు. పంకజ్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేశామని వివరించారు. ఎఫ్ఐఆర్‌లో 11 మంది నిందితుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Kieron Pollard : ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్‌కు మ‌ద్ద‌తుగా పొలార్డ్‌..! అవ‌స‌రం తీర‌గానే..