Uppena Movie : ఉప్పెన తరహాలో… కూతురు వెంట పడుతున్న వ్యక్తి పై దాడి

తన కూతురు  వెంటపడుతున్నాడనే నెపంతో   ఒక తండ్రి,  యువకుడి మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ ఘటన జరగటంతో 

Eluru Uppena Cinema

Uppena Movie : తన కూతురు  వెంటపడుతున్నాడనే నెపంతో   ఒక తండ్రి,  యువకుడి మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ ఘటన జరగటంతో  ప్రతి ఒక్కరూ ఈవిషయంపై చర్చించుకుంటున్నారు.

చాట్రాయి మండలం నరసింహారావుపాలెనికి చెందిన సింగపం శ్రీకాంత్(24) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన జాన్ అనే వ్యక్తి  కుమార్తె వెంట పడుతున్నాడు.  అంతేకాక ఆమె గురించి ఫేస్ బుక్ లో కూడా   అసభ్య కరంగా  పోస్ట్ లు పెట్టినట్లు తెలిసింది. ఈ సంగతి తెలిసిన జాన్,  శ్రీకాంత్ ను తన ఇంటికి పిలిపించాడు.  చీకటి గదిలో శ్రీకాంత్ ను బంధించి. చిత్ర హింసలకు గురిచేశాడు. అంతటితో అతని కోపం చల్లారక  రోకలి బండతో శ్రీకాంత్ మర్మాంగాలపై తీవ్రంగా కొట్టాడు.జాన్ కొట్టిన దెబ్బలకు శ్రీకాంత్ సొమ్మసిల్లి పడిపోయాడు.
Also Read : Corona in China: కరోనా నాలుగో దశలో మొదటిసారి చైనాలో మూడు కరోనా మరణాలు
సమాచారం తెలుసుకున్న శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జాన్ ఇంటి నుంచి శ్రీకాంత్ ను మొదట ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా… బాధితుడి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.