man attack with blade at jubliee hills : దొంగతనం చేయబోతే ఆ వ్యక్తి ఎదురు తిరిగి కాలితో తన్నాడు. దాంతో కొపగించుకున్న దొంగ కొద్ది సేపటి తర్వాత వచ్చి ఆ వ్యక్తి గొంతుకోసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. యాచక వృత్తి చేసుకుని జీవనం సాగించే హన్మంతు అనే వ్యక్తి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లోని నీరూస్ బట్టల దుకాణం ఫుట్ పాత్ పై మద్యం సేవించి పడుకున్నాడు.
చాంద్రాయణ గుట్టకు చెందిన ఎం.డి.హసన్(19) అటుగా వచ్చి నిద్రపోతున్న హన్మంతు జేబులోని డబ్బులు దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో స్పృహలోకి వచ్చిన హన్మంతు హసన్ ను కాలితో తన్నాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన హసన్ కొంత సేపటి తర్వాత తిరిగి వచ్చి బ్లేడుతో హన్మంతు గొంతు కోశాడు. బాధతో హన్మంతు కేకలు వేయటంతో అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.