అయ్యో, బీరు అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా

  • Publish Date - April 16, 2020 / 08:01 AM IST

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు బంద్ ఉన్నాయి. మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులకు పిచ్చెక్కింది. చుక్క మందు లేక విలవిలలాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించడంతో మందుబాబుల కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు కిక్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు టర్పెంటైన్‌లో కూల్‌డ్రింక్ కలుపుకొని తాగుతున్నారు. మరికొందరు ప్రొపైల్ ఆల్కహాల్‌ను సేవిస్తున్నారు. ఇలా ప్రయోగాలు చేసి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. మద్యం కష్టాలకు తాజాగా మరొకరు బలయ్యారు. ఓ మందుబాబు.. బీర్‌ అనుకుని యాసిడ్ తాగడంతో చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఈ విషాదం జరిగింది.

బీరు బాటిల్ లో యాసిడ్ నిల్వ:
అతడి పేరు సురేష్ సజల్కర్. వయసు 50 ఏళ్లు. చక్కీ క్రాసింగ్ లో నివాసం ఉంటాడు. మద్యానికి బానిస అయిన సురేష్ లాక్‌డౌన్‌తో వైన్ షాపులు మూతపడడంతో మందు దొరక్క అల్లాడిపోతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఓ చోట బీర్‌ బాటిల్ కనిపించింది. కొన్ని నెలల కిందట ఆ బాటిల్‌లో యాసిడ్ పోసి నిల్వచేశారు. ఆ విషయాన్ని గమనించని సురేష్.. బాటిల్‌ను చూసిన వెంటనే ఓపిక పట్టలేక గడగడతాగేశాడు. అనంతరం కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(ఏప్రిల్ 15,2020) కన్నుమూశాడు. 

శరీర అంతర్భాగాలు తీవ్రంగా దెబ్బతినడంతో మృతి:
యాసిడ్‌ను తాగడంతో శరీర అంతర్భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలిపారు. సురేష్ మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. బీరు అనుకుని యాసిడ్ తాగి చనిపోయిన ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మందు షాపులు తెరిచేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయోనని మద్యం తాగే అలవాటున్న వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఏప్రిల్ 20 తర్వాత వైన్స్ షాపులు తెరుస్తారని ఆశలు:
లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించడంతో రాష్ట్రంలో సినిమా హాల్స్, మాల్స్ అప్పటివరకు మూసివేసి ఉంటాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఏప్రిల్ 20 వరకు లిక్కర్ షాపులు మూసి ఉంటాయన్నారు. దీంతో మందుబాబులు ఏప్రిల్ 20పై ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 20 తర్వాత వైన్స్, బీర్స్ షాపులు తెరుస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి మందుకోసం మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read | మోడీతో సమావేశమైన నిర్మలా…వలస కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీ!