×
Ad

Fire Accident : మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి

హైదరాబాద్  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. 

  • Published On : November 17, 2021 / 04:38 PM IST

Man Died Fire accident

Fire Accident : హైదరాబాద్  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.  ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్, కిరోసిన్ మరియు వైట్ టినర్ అగ్నికి ఆహుతయ్యాయి. అనిల్ అనే వ్యక్తి ఇంట్లో వీటిని నిల్వ చేసాడు.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మృతుడు ఇంట్లోనే ఉన్నాడు. మంటల్లో చిక్కుకున్న అనిల్ మంటల నుంచి తప్పించుకునేందుకు  బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.  డీజిల్, కిరోసిన్, టినర్ లు మండటం ద్వారా  వచ్చిన  వేడికి   పొగకు  ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు.  సమాచారం తెలుసుకుని అగ్నిమాపక శకటాలు ఘటనా స్ధలానికి వచ్చి సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చాయి.

Also Read : Biswabhusan Harichandan : ఆంధ్ర గవర్నర్‌ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్

స్పృహ తప్పి పడిపోయిన అనిల్‌ను  108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.  ఇళ్లకు పెయింట్ వేసే సమయంలో   వైట్ టీనర్ వాడతారు.ఇది చాలా ప్రమాదకరమైనదని  స్థానికులు చెప్తున్నారు.   ఇలాంటి మండే   స్వభావం గల వస్తువులు  ప్రజలు నివసించే  ఇళ్ళ మధ్య  నిల్వ చేయవద్దని  చెప్పినా కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.