అలర్ట్ : సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

  • Publish Date - November 11, 2019 / 10:38 AM IST

చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఒడిశాలోని పారాదీప్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా రాన్ పూర్ గ్రామానకి చెందిన కున్ ప్ర్రధాన్ అనే వ్యక్తి పారాదీప్ లో ఓ ఆలయ నిర్మాణంలో కూలీ గా పని చేస్తున్నాడు.  ఆలయ నిర్మాణంలో భాగంగా గత రెండు నెలుగా అక్కడి ఆఫీసులో ప్రధాన్ నివసిస్తున్నాడు.

ఆదివారం నవంబర్ 9వ తేదీ రాత్రి  తన  సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి, దాని పక్కనే పడుకున్నాడు.రాత్రి ఒకానొక సమయంలో  సెల్ ఫోన్ పేలిపోయింది. సెల్ ఫోన్ పేలటంతో దాని పక్కనే పడుకున్న ప్రధాన్ తీవ్ర గాయాలై అక్కడిక్కకడే మరణించాడు.  }

సోమవారం ఉదయం తోటి కూలీలు పనిలోకి వచ్చి ప్రధాన్ ఉన్న రూంలోంచి పొగరావటం గమనించారు. వెంటనే తలుపులు తెరిచి చూడగా ప్రధాన్ ముఖం మొత్తం కాలిపోయి ఉంది. కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.