Hyderabad : ప్రకాష్‌‌నగర్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి మృతి

సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. అనంతరం అమాంతం స్టేషన్ నుంచి కిందకు దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Prakash Nagar Metro Station : హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరొందిన మెట్రో రైలు సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. స్టేషన్ పై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. గతంలో కూడా పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి వేళ ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా వైఫల్యంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు హైదరాబాద్ లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది.

Read More : Pawan Kalyan : ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. పవన్‌ని కలిసిన హరీష్ శంకర్..

పలు ప్రాంతాలకు రైళ్లు తిరుగతున్నాయి. దేశంలోనే రెండో పెద్ద మెట్రోగా హైదరాబాద్ నిలిచింది. ఇదిలా ఉంటే… సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. అనంతరం అమాంతం స్టేషన్ నుంచి కిందకు దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రగాయాలై రక్తం మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి నిజామాబాద్ కు చెందిన రాజుగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు