స్నేహితుడి చెల్లెలితో అఫైర్.. కిడ్నాప్ అంటూ కొట్టి చంపేశాడు!

  • Published By: sreehari ,Published On : August 9, 2020 / 07:24 PM IST
స్నేహితుడి చెల్లెలితో అఫైర్.. కిడ్నాప్ అంటూ కొట్టి చంపేశాడు!

Updated On : August 9, 2020 / 7:34 PM IST

స్నేహితుడి ఇంటికి వస్తూ.. అతడి చెల్లిలితో సంబంధం పెట్టుకున్నాడు.. చేస్తుంది తప్పు అన్నందుకు దారుణుంగా కొట్టి చంపేశాడో కిరాతకుడు. కిడ్నాప్ పేరుతో స్నేహితుడిని హత్య చేశాడు.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టంలోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విపిన్ విజయనగరంలోని శాంతినగర్ లో నివాసముంటున్నాడు.

పక్కనే అతడి స్నేహితుడు దీపక్‌ నివాసముంటున్నాడు. పక్కంట్లో ఉండే విపిన్‌ సోదరితో దీపక్ అఫైర్ పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన విపన్.. పద్ధతి మార్చుకోమని మందలించాడు.. ఎన్నిసార్లు చెప్పిన అతడితో చెల్లిలితో సంబంధాన్ని కొనసాగించాడు.. ఎప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ఒకరోజున ఆగ్రహంతో విపన్.. దీపక్ ను కొట్టాడు.



తనపై చేయి చేసుకున్నాడని దీపక్ విపిన్‌పై కక్ష పెంచుకున్నాడు. తనను ఎలాగైనా హత్య చేసి తనకు అడ్డు తగిలించుకోవాలని పథకం వేశాడు. ఉద్యోగం పేరుతో విపిన్‌ను గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు.. ఇటుకతో దాడి చేసి హత్య చేశాడు. అందర్ని నమ్మించేందుకు కిడ్నాప్ నాటకమడాడు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.20 లక్షలు డిమాండ్‌ చేస్తూ ఓ ఫోన్‌ కాల్‌ చేయించాడు.. కిడ్నాపర్లే డబ్బు కోసం చంపేశారంటూ కథ అల్లాడు..



పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మిత్రులు అశ్శు, రోహిత్‌లకు ఫోన్‌ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు. పోలీసులు దీన్ని మొదట కిడ్నాప్ కేసుగా భావించారు. ముందు దీపక్‌ను విచారించి వదిలేశారు. అతడి ఫోన్‌ పరిశీలించగా అశ్శు, రోహిత్‌లకు పలుమార్లు కాల్‌ చేసినట్లు తేలింది.. హత్య చేసింది నిందితుడు విపన్ అని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా తానే హత్య చేసానని అంగీకరించాడు.