Musheerabad Ps
Murder In Musheerabad : క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తోటి వారిని..సొంత కుటుంబసభ్యులనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బులు, ఆస్తులు, కుటుంబ తగాదాలు, మద్యం మత్తులో హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో…కేవలం రూ. 2 వేల కోసం సొంత స్నేహితుడినే చంపేశాడో ఓ వ్యక్తి. ముషిరాబాద్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హత్యకు పాల్పడిన వ్యక్తి..నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయినట్లు తెలుస్తోంది.
Read More : PUBG : గేమర్స్‌కు గుడ్ న్యూస్, పబ్ జీ గేమ్ వచ్చేసింది..కొత్తకొత్తగా!
వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను (27) బతుకుతెరువు కోసం ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన ముషిరాబాద్ లో స్థిరపడ్డాడు. ముషీరాబాద్ భరత్ నగర్ కు చెందిన బ్రహ్మచారి అనే వ్యక్తి వద్ద కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. మటన్ షాప్ లో పని చేసే అల్తాఫ్ ఖాన్ యువకునితో కలిసి ముషీరాబాద్ లో ఒకే గదిలో నివాసం ఉండేవారు. గతంలో ఇచ్చిన రూ. 2 వేలు ఇవ్వాలని అల్తాఫ్ ఖాన్..సోనును అడిగాడు. ఆ సమయంలో రూమ్ లో మద్యం సేవించారు.
Read More : Canine Virus : కేరళలో వింత వ్యాధి కలకలం… వరుసగా మరణాలు
మద్యం మత్తులో ఉన్న వీరిద్దరి మధ్య ఆ విషయంలో గొడవ జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన అల్తాఫ్ ఖాన్ కత్తితో సోను గొంతుకోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీసులకు లొంగి పోయినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, ముషీరాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.