West Bengal : కిటికీలోంచి పారిపోయిన భార్య.. తీసుకొస్తే రూ. 5 వేలు ఇస్తానన్న భర్త

పింగ్లా గ్రామంలో ఓ వ్యక్తి వడ్రంగి పని చేసుకుంటూ..తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. డిసెంబర్ 09వ తేదీన పని మీద బయటకు వెళ్లినట్లు..కానీ బిడ్డతో భార్య ఎక్కడికో...

West Bengal : కిటికీలోంచి పారిపోయిన భార్య.. తీసుకొస్తే రూ. 5 వేలు ఇస్తానన్న భర్త

Wife Bengal

Updated On : December 28, 2021 / 7:28 PM IST

Wife runs away : చిన్న చిన్న కారణాలకే భార్య, భర్తలు విడిపోతున్నారు. అంతేగాకుండా..దారుణాలకు సైతం తెగబడుతున్నారు. క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. తాజాగా..తన భార్య కిటీకీలో నుంచి పారిపోయిందని..చిన్నారితో సహా వెళ్లిపోయిన ఆమెను వెతికి తీసుకొస్తే వారికి రూ. 5 వేలు ఇస్తానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Prakash Javadekar : వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కరప్షన్‌ పార్టీలు : ప్రకాశ్‌ జవదేకర్‌

పింగ్లా గ్రామంలో ఓ వ్యక్తి వడ్రంగి పని చేసుకుంటూ..తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. డిసెంబర్ 09వ తేదీన పని మీద బయటకు వెళ్లినట్లు..కానీ బిడ్డతో భార్య ఎక్కడికో వెళ్లిపోయిందనే సమాచారం వచ్చిందని పోస్టులో వెల్లడించాడు. కిటికి గుండా వెళ్లిన తన భార్యను వెతికి తీసుకొచ్చిన వారికి రూ. 5 వేలు ఇస్తానని ప్రకటించాడు. తన ఇంట్లో మొబైల్ ఫోన్ లేదని, ఒక్కతే కిటికి పగులగొట్టి పారిపోదని..ఓ వ్యక్తి సహకారంతో ఇది జరిగిందని వాపోయాడు.

Read More : India Covid Vaccination : పిల్లలు, వృద్ధుల వివరాలు వెల్లడించిన కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అంటే

ఇంట్లో నుంచి వెళ్లే ముందు డబ్బు, నగలు, ఓటర్ ఐడీ, ఆధార్, పిల్లల బర్త్ సర్టిఫికేట్ పత్రాలు కూడా తీసుకపోయిందన్నాడు. తన భార్యకు చెందిన బంగారు ఆభరణాలకు ప్రలోభపడి ఉంటాడని, పెద్దగా చదువుకోలేని భార్య..అతని మాయమాటలకు మోసపోయిందన్నాడు. ఆమె కోసం తన కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అయితే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారా ? లేదా ? అనేది తెలియలేదు.