డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

  • Published By: Chandu 10tv ,Published On : July 13, 2020 / 12:27 PM IST
డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

Updated On : July 13, 2020 / 1:38 PM IST

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.

నిందితుడి పేరు నరేష్. అతన్ని శనివారం జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. నిందితుడు సీసీటీవీ కెమెరాలను విక్రయించి, వ్యవస్థాపించడానికి పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ జులై 6, 7 మధ్యరాత్రి ఆమె ముఖంపై శానిటైజర్ విసిరి లైటర్ ను ఉపయోగించి తగలబెట్టడం చేశాడు. దీంతో బాధితురాలు 20 శాతం కాలిన గాయాలకు గురైంది. వెంటనే పొరుగూరు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఈ మహిళ గత ఏడాది డిసెంబర్లో చండీగర్ కు వచ్చింది. మెల్లగా నరేష్ తో స్నేహం చేసింది.. కొన్నిరోజులకి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అయితే బాధితురాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అతనిపై ఫిర్యాదు చేసింది. నరేష్ డబ్బు కోసం తనను అప్పుడప్పుడు కొట్టేవాడు అని ఆ మహిళ పోలీసులకు తెలిపింది.