‘అవమానం తట్టుకోలేకపోతున్నా’.. భార్యకు వీడియో కాల్ చేసి భర్త బలవన్మరణం..

పిల్లలను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి..

Husband Takes Life: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అవమానం తట్టుకోలేకపోతున్న అంటూ అతడు పురుగుల మందు తాగేశాడు. మృతుడిని కిరణ్ గా గుర్తించారు. శైలజ అనే మహిళ దగ్గర కిరణ్ అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పుని అతడు తీర్చలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన శైలజ కిరణ్ ఇంటికి వెళ్లింది.

అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడం లేదంటూ కిరణ్ పై చేయి చేసుకుంది. అంతేకాదు డెలివరీ అయ్యి ఇంట్లో ఉన్న కిరణ్ భార్య చెవి కమ్మలు తీసుకుంది. పాపాయిని బెడ్ పై పడేసి వెళ్లిపోయింది శైలజ. దీంతో కిరణ్ బాగా హర్ట్ అయ్యాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు.

Also Read: ప్రాణం తీసిన పార్ట్ టైమ్ ఉద్యోగం..! ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. మంటల్లో సజీవ దహనం..

అవమానం తట్టుకోలేకపోయిన కిరణ్ మరుసటి రోజు భార్యకు వీడియో కాల్ చేశాడు. పిల్లలను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన బోయిన్ పల్లి పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు.