Indian Student Lost Life: ప్రాణం తీసిన పార్ట్ టైమ్ ఉద్యోగం..! ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. మంటల్లో సజీవ దహనం..

పంజాబ్ తరన్ తారన్ ప్రాంతానికి చెందిన అర్ష్ ప్రీత్ సింగ్.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే సమయంలో ట్రక్ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.

Indian Student Lost Life: ప్రాణం తీసిన పార్ట్ టైమ్ ఉద్యోగం..! ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. మంటల్లో సజీవ దహనం..

Updated On : June 22, 2025 / 7:32 PM IST

Indian Student Lost Life: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన విద్యార్థి చనిపోయాడు. అతడు నడుపుతున్న ట్రంక్ బ్యారియర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకుని మరణించాడు. మృతుడిని అర్ష్ ప్రీత్ సింగ్ కారాగా గుర్తించారు. అతడి వయసు 23ఏళ్లు. అర్ష్ ప్రీత్ సింగ్ ది పంజాబ్. చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అలాగే ట్రక్ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ప్రమాదం జరిగింది. నార్త్ ఈస్ట్ పెర్త్ గ్రేట్ ఈస్ట్రన్ హైవేపై ఈ ఘటన జరిగింది.

అర్ష్ ప్రీత్ సింగ్ వోల్వో ట్రక్ ని నడుపుతున్నాడు. వాహనం అదుపు తప్పి బ్యారియర్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తా కొట్టింది. వాహనంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని అర్ష్ ప్రీత్ స్పాట్ లోనే చనిపోయాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ స్పాట్ కి చేరుకున్నాయి. వారు వచ్చే సమయానికి ట్రక్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకుని అర్ష్ ప్రీత్ మరణించాడు. ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు.

Also Read: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం.. తిరుమలకు వెళ్లి వస్తూ..

పంజాబ్ తరన్ తారన్ ప్రాంతానికి చెందిన అర్ష్ ప్రీత్ సింగ్.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే సమయంలో ట్రక్ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆ ఉద్యోగమే అతడి పాలిట మృత్యువైంది. అర్ష్ ప్రీత్ చనిపోయాడని తెలిసి అతడి ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత తొందరగా అర్ష్ ప్రీత్ మృతదేహాన్ని పంజాబ్ కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.