Encounter At Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు-మావోయిస్టు కమాండర్ మృతి

ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు. 

Encounter At Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు-మావోయిస్టు కమాండర్ మృతి

Chhattisgarh Encounter

Updated On : November 16, 2021 / 1:16 PM IST

Encounter At Chhattisgarh :  ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు.  బస్తర్ ప్రాంతంలోని నారాయణపూర్ జిల్లా ఛోటే డోంగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని   బహ్కేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం తో రిజర్వ్ గార్డ్స్ జవాన్లు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కూబింగ్ జరుపుతున్నారు.

మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వారి పైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలకనేత కమాండర్ సాకేత్ నూరేటి మృతి చెందాడు.

Also Read : Hardik Pandya: హార్దిక్ పాండ్యా రూ.5కోట్ల విలువైన రిస్ట్ వాచీలు సీజ్.. ట్విట్టర్‌లో క్లారిటీ

ఘటనా స్ధలంనుంచి ఏకే47 ఆయుధాన్ని కొన్ని మారణాయుధాలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు మావోయిస్టులు ఘటనా స్ధలం నుంచి తప్పించుకు  పారిపోయారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మరణించిన సాకేత్ నిషేధిత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ‌కి కమాండర్‌గా ఈస్ట్ బస్తర్ డివిజన్‌లో పని చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.