విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం 

  • Publish Date - May 16, 2019 / 04:26 PM IST

విశాఖపట్నం:  విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో  ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.  ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు.  సమాధాన్ పేరిట భద్రతా బలగాలు చేస్తున్న దాడులను, అరాచకాలను, రాజ్య హింసను ఖండించి అడ్డుకోకపోతే మన్యం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని  సిపిఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో  విడుదల చేసిన ఆ లేఖలో హెచ్చరించారు.

గతంలో గనులు, అడవుల దోపిడీ మీద కిడారి సర్వేశ్వర రావు, సివెరి సోమలకు మావోలు ఇలాటి హెచ్చరికలే జారీ చేసారు. మావోల లేఖతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం నేతలు మైదానానికి తరలిపోవాలని సూచించారు వారికి భద్రత పెంచారు. ముఖ్య కూడళ్లలో సాయుధ పోలీసులను అలర్ట్ చేశారు.