Exchange of Fire : ఏవోబీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు

ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Aob Maoists Police

Exchange of Fire : ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా వారి కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులకు మల్కన్ గిరి జిల్లాతులసిపాడు అటవీ ప్రాంతంలో మావోయస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది.
Also Read : China Real Estate Crisis : చైనా నుంచి ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు

డీఎవీఎఫ్ఓ,ఎస్ఓటీ బలగాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. పోలీసులను గమనించిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. పోలీసులు తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. మావోయిస్టులకు ఇటీవల తరచూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.