Woman Suicide
Nalgonda District : నల్గోండజిల్లా మునగాల మండలం ముకుందాపురంలో వివాహిత మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె మరణించి ఉంది.
భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోటానికి ముందు 25 నిమిషాల పాటు వేరొకరితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.