వివాహేతర సంబంధం-ఆవేశంలో భార్యను హత్య చేసిన మాజీ సైనికుడు

వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నాయని తెలిసి కూడా కొంత మంది ప్రజలు వాటివైపే మొగ్గుచూపటం బాధ కలిగించే విషయం. వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త చేతిలో మరణించిన ఒక భార్య కధ తమిళనాడులోని వేలూరు లో జరిగింది.
వేలూరు సమీపంలోని కమ్మవాన్ పేటకు చెందిన సెల్వం సైన్యంలో పని చేసి రిటైరై స్వగ్రామం వచ్చాడు. స్ధానికంగా ఒక ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సెల్వానికి భార్య చిత్ర(36) తో 20 ఏళ్ల క్రితం వివాహాం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చిత్రకు కొంతకాలం క్రితం అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో పరిచయం అయ్యింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసి వారిద్దరూ తరచూగా కలుసుకునేవారు. భర్త సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగానికి వెళ్లిపోగానే చిత్ర తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లి తన సరదాలు తీర్చుకుని వచ్చేది. కొన్నాళ్లకు ఈ విషయం సెల్వంకు తెలిసి ఆమెను హెచ్చరించాడు.
భర్త హెచ్చరించినా, చిత్ర తన ప్రియుడ్ని కలవటం మానలేదు. ఈవిషయమై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆదివారం,జూన్ 7న చిత్ర తన ప్రియుడితో బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చింది. తల్లి ప్రవర్తన పట్ల విసుగు చెందిన చిత్ర కుమార్తె తల్లిని అక్రమ సంబంధం మానుకోవాలని హితవు చెప్పింది. ఈవిషయంలో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ విషయాన్ని తండ్రికి సెల్ ఫోన్ ద్వారా కుమార్తె సమాచారం అందించింది. రాత్రి 12 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సెల్వం భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్యా,భర్త కూతుర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఉన్న సెల్వం ఇంట్లోని పెద్ద కర్రతో చిత్ర తలపై కొట్టాడు.
సెల్వం కొట్టిన దెబ్బకు తీవ్ర రక్తస్రావం కావటంతో చిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే చిత్ర మరణించింది. సమాచారం అందుకున్న వేలూరు పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సెల్వాన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
Read: సోషల్ మీడియాలో స్నేహం…న్యూడ్ ఛాటింగ్…బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి