మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు

  • Publish Date - March 9, 2020 / 04:11 AM IST

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఆయన మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతడి భార్యకు మృతదేహాన్ని అప్పగించారు. రాత్రి మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించారు. అయితే..ఈ అంత్యక్రియలకు ఆయన కూతురు అమృత వస్తుందా ? లేదా ? అనే సందిగ్థత నెలకొంది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌‌లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

మారుతీరావు మృతి నేపథ్యంలో మిర్యాలగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మారుతీరావు కుమార్తె అమృత నివాసం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు కుటుంబ సభ్యులు ఆమె ఇంటిపై దాడి చేసే ప్రమాదముందని పోలీసులు భావించి .. సెక్యూరిటీ పెంచారు. మరోవైపు తన తండ్రి అంత్యక్రియలకు  దూరంగా ఉండాలని అమృత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

See Also | బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా లండన్‌ మహిళ పోటీ!

మరోవైపు…మారుతీరావు మృతి మిస్టరీగా మారింది. ఆయన మృతిపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా… లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు మారుతీరావు. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చాడు. తండ్రి మారుతీరావుపై అమృత ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనకు బెయిల్ మంజూరు కావడంపై అమృత ఆందోళన వ్యక్తి కూడా చేసింది. తండ్రి వల్ల తనకు, తన అత్తగారి కుటుంబానికి ప్రాణహానీ ఉందని వెల్లడించింది. తనను బెదిరిస్తున్నారంటూ..అమృత ఫిర్యాదు చేయడంతో మారుతీరావుపై, ఇతరులపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఇటీవలే..మారుతీరావు షెడ్‌లో గుర్తు తెలియని శవం లభించింది. 

Read More : బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తల్లి వచ్చింది..ఆ తర్వాత బాలిక ఏం చేసింది