చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీ.. ఆరుగురు మృతి

గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీ.. ఆరుగురు మృతి

Updated On : September 13, 2024 / 7:02 PM IST

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. లారీ అదుపు తప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుది. అదుపు తప్పిన లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి రాంప్రసాద్.

అసలేం జరిగిందంటే..
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది బెంగళూరుకు వెళ్లే ఘాట్ రోడ్. దీన్నే మొగలి ఘాట్ రోడ్ గా చెబుతారు. వంద టన్నుల ఐరన్ ఓర్ తో వస్తున్న లారీ ఘాట్ రోడ్ లో పూర్తిగా అదుపుతప్పి బ్యాలెన్స్ కోల్పోయి ఎదురుగా ఉన్న రోడ్డులోకి వెళ్లిపోయింది. అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న బస్సు ఈ లారీని ఢీకొట్టింది. అదే సమయంలో మొత్తం నాలుగైదు వాహనాలు ఒక్కసారిగా ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులే తీవ్రంగా గాయపడ్డారు.

చనిపోయిన ఆరు మంది కూడా బస్సులో ప్రయాణికులే అని తెలుస్తోంది. బస్సులో ఉన్న దాదాపు 25మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదారుగురి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ లోడ్ తో వస్తున్న లారీ రోడ్డు డౌన్ కావడంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు.

లారీ వెనకాల భారీగా బరువు ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ క్రమంలో లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న రోడ్డులోకి వెళ్లడం ఘోర ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఘాట్ రోడ్ లో పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read : అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు.. ఒక్కసారిగా శత్రువులుగా మారి..