తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ హైదరాబాద్‌లో ఘరానా మోసం, రూ.700 కోట్లతో పరార్..!

తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను వాడుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వారితో ప్రమోషన్లు కూడా ఇప్పించారు.

Massive Fraud (Photo Credit : Google)

Hyderabad Investment Fraud : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఓ సంస్థ చీట్ చేసింది. 700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఆశ చూపి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించింది DKZ టెక్నాలజీస్. హైదరాబాద్ వ్యాప్తంగా 18వేల మంది బాధితులు ఉన్నారు. వందలాది మంది బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. 3 రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా ఈ సంస్థ బాధితులు ఉన్నట్లు సమాచారం.

నమ్మకం కలిగించేందుకు ఇన్వెస్టర్లకు తొలుత లాభాలు చూపింది కంపెనీ. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో నమ్మకం కుదిరి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలు తరలి వచ్చారు. చివరికి రూ.700 కోట్లు దండుకుని సంస్థ యాజమాన్యం పరారైంది.

కాగా, తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను వాడుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వారితో ప్రమోషన్లు కూడా ఇప్పించారు. లాభాలు వస్తుండటంతో అప్పు చేసి కొందరు, బంగారం అమ్మి మరికొందరు భారీగా పెట్టుబడులు పెట్టారు. చివరికి అడ్డంగా మోసపోయారు. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.

Also Read : అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు.. ఒక్కసారిగా శత్రువులుగా మారి..