ఐన్ స్టీన్ సిద్దాంతాన్ని ఛాలెంజ్ చేసిన నారాయన్ సింగ్ కన్నుమూత

ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) కన్నుమూశారు. 40ఏళ్లుగా మనోవైకల్యంతో భాధపడుతున్న ఆయనకు ఇవాళ(నవంబర్-14,2019) ఉదయం నుంచి సీరియస్ గా ఉండటంతో ట్రీట్మెంట్ కోసం పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ మధ్యాహ్నాం ఆయన తుదిశ్వాస విడిచారు.
భోజ్ పూర్ జిల్లాలోని బసంత్ పూర్ కి చెందిన నారాయన్ సింగ్…ఐన్ స్టీస్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని ఆయన ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. 1942లో జన్మించిన వశిష్ఠ నారాయన్ సింగ్ కు.. క్యాలుక్యులేషన్స్ లో ఉన్న స్కిల్స్ అద్భుతం. పోలో మిషన్ ప్రారంభించటానికి ముందు ఒకేసారి పలు కంప్యూటర్లు ఆగిపోయినప్పుడు… నారాయణ్ మెదడులోని లెక్కలు… తిరిగి వచ్చినప్పుడు కంప్యూటర్ల మాదిరిగానే ఉన్నాయని నమ్ముతారు.