Medak Car Fire Case : ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య కేసు.. ధర్మా నాయక్‌కి సహకరించింది ఎవరు?

సంచలనం రేపిన మెదక్ జిల్లా వెంకటాపురం సజీవదహనం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.

Medak Car Fire Case : సంచలనం రేపిన మెదక్ జిల్లా వెంకటాపురం సజీవదహనం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లనున్నారు. ధర్మా నాయక్ కు ఇంకా ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన తర్వాత ధర్మా నాయక్ ఎక్కడికి వెళ్లాడనే విషయంపై ఆరా తీస్తున్నారు.

అతడు సెక్రటేరియట్ ఉద్యోగి. పేరు ధర్మా నాయక్. వ్యసనాలకు బానిస అయిన ధర్మా నాయక్ భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేశాడు. తనకు తాను చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. అలా చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని పథకం రచించాడు. ఇందులో భాగంగా ఓ అమాయకుడిని బలి తీసుకున్నాడు. అయితే, ధర్మా నాయక్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అతడు బతికే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

Also Read..Medak Car Fire Mishap Case : మెదక్ జిల్లాలో సజీవదహనం కేసులో షాకింగ్ ట్విస్ట్.. డబ్బు కోసం సెక్రటేరియట్ ఉద్యోగి దారుణం

టేక్మాల్‌ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం కలకలం రేపింది. సెక్రటేరియట్‌ ఉద్యోగి ధర్మా నాయక్‌ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్సూరెన్స్‌ డబ్ముల కోసమే ధర్మా నాయక్ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ధర్మా నాయక్‌ నాటకం ఆడాడు. ప్రమాద స్థలంలో పెట్రోల్‌ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు.

Also Read..Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన భార్య

ధర్మా నాయక్ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మా నాయక్ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. తమదైన శైలిలో విచారించగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. చనిపోయింది కారు డ్రైవర్‌ అని పోలీసులు గుర్తించారు అప్పులు చేసి బెట్టింగ్‌ ఆడిన ధర్మా నాయక్.. ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టేక్మాల్‌ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్‌ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.