×
Ad

Bengaluru: బాబోయ్.. సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్లం అంటూ.. ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి రూ.7 కోట్లతో పరార్..

సౌత్ డివిజన్ పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు.

Bengaluru: బెంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పన్ను అధికారులం అంటూ బిల్డప్ ఇచ్చి ATM నగదు లోడింగ్ వ్యాన్‌ నుంచి రూ.7కోట్ల డబ్బుతో పరార్ అయ్యారు. జయనగర్‌లోని అశోక పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దొంగలు నిమిషాల్లోనే వాహనాన్ని నియంత్రించి దాదాపు రూ.7 కోట్లతో పారిపోయారు.

పోలీసులు తెలిపిన ప్రకారం CMS వ్యాన్ (ఏటీఎం క్యాష్ లోడింగ్ వ్యాన్) JP నగర్‌లోని HDFC బ్యాంక్ బ్రాంచ్ నుండి నగదు తీసుకెళ్తుండగా.. ఒక ఇన్నోవా కారు దారిలో అడ్డుకుంది. కారులోంచి కిందకు దిగిన దుండగులు.. తమను తాము కేంద్ర ప్రభుత్వ పన్ను అధికారులుగా చెప్పుకున్నారు. పత్రాలను ధృవీకరించి నగదును తనిఖీ చేయాలని సిబ్బందితో చెప్పారు. ఆ తర్వాత CMS సిబ్బందిని నగదు పెట్టెలతో పాటు తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. డైరీ సర్కిల్ వైపు కారు పోనిచ్చారు. తర్వాత సిబ్బందిని ఫ్లైఓవర్‌పై తోసేసి డబ్బుతో పారిపోయారు.

ఈ ముఠా బన్నేరుఘట్ట రోడ్డు ద్వారా తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సౌత్ డివిజన్ పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాన్ని గుర్తించడానికి జయనగర్, డైరీ సర్కిల్, బన్నేరుఘట్ట రోడ్డులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Also Read: ఐఫోన్ యూజర్లకు పండగే.. ఇకపై ఒకే ఐఫోన్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు.. ఎలాగంటే? ఫుల్ డిటెయిల్స్..!