madhapur SOT police
Hyderabad : హైదారాబాద్ మియాపూర్‌లో తుపాకులు దొరకటంతో కలకలం రేగింది. మియాపూర్‌కు చెందిన ఓ రౌడీ షీటర్ వద్ద రెండు తుపాకులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బీహార్ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
తుపాకులు ఎందుకు తెప్పించారు. వాటికి లైసెన్స్ ఉందా…. ఎవరిపైనా అయినా దాడి చేయటానికి ప్లాన్ చేశారా వంటి వివిధ కోణాలలో పోలీసులు విచారించనున్నారు. రౌడీ షీటర్ పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము