ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణం అదే

కారు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? ఈ వివరాలు పోలీసులు తెలిపారు.

MLA Lasya Nanditha Car Incident : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసుకి సంబంధించి పటాన్ చెరు పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కారు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? ఈ వివరాలు తెలిపారు. పటాన్ చెరు ORRపై జరిగిన రోడ్డు ప్రమాదం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందన్నారు. ఈ కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ సంజీవ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదం.. పోలీసులు వెల్లడించిన వివరాలు..
* నిన్న లాస్య నందిత సదాశివపేటకు వెళ్లి వచ్చారు.
* ఇవాళ ఉదయం అల్పాహారం కోసం బయటకు వెళ్లారు.
* తెల్లవారుజామున 4గంటల 58 నిమిషాల సమయంలో శామీర్ పేట టోల్ ప్లాజా వద్ద నందిత కారు ORRపైకి ఎక్కింది.
* సదాశివపేటలోని దర్గాకు వెళ్ళే క్రమంలో సుల్తాన్ పూర్ ఎగ్జిట్ సమీపంలో 5:30 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొంది.
* ఈ క్రమంలో కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొని ప్రమాదం జరిగింది.
* ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత(37)కు తీవ్ర గాయాలు అయ్యాయి.
* ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
* డ్రైవర్ ఆకాష్ (24) కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు విరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
* ఇది రోడ్డు ప్రమాదమే. ఎలాంటి అనుమానాలు లేవు.

Also Read : లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే లాస్య.. స్పాట్ లోచే చనిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య తండ్రి సాయన్న గతేడాదే కన్నుమూశారు. దీంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ.

గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మరణించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. మారేడుపల్లిలోని ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు.

Also Read : లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..

తండ్రి మరణించిన ఏడాదికే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే లాస్య.. స్పాట్ లోచే చనిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య తండ్రి సాయన్న గతేడాదే కన్నుమూశారు. దీంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ.

గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మరణించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. మారేడుపల్లిలోని ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు.

లాస్య నందిత రాజకీయ ప్రస్థానం..
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత 2015లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో కవాడిగూడ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2021లో అక్కడి నుంచే ఓటమి చెందారు. తన తండ్రి జి.సాయన్న మరణం తర్వాత ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య గెలుపొందారు.

ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదం.. డ్రైవర్‌పై పోలీస్ కేసు నమోదు
ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పటాన్ చెరు పోలీసులు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న ఆకాశ్ పై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సదాశివపేటలో పూజలు ముగించుకుని తిరిగి బోయిన్ పల్లికి వచ్చేశారు లాస్య కుటుంబీకులు. ఆకలి అవుతుండడంతో ఏమైనా తీసుకొస్తానని చెప్పి లాస్య వెళ్లారు.

తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో బోయిన్ పల్లి నుండి మళ్లీ సదాశివపేట సైడ్ వెళ్లింది లాస్య కార్. ఉదయం 5గంటల 15 నిమిషాలకు ఆకాశ్ ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని చెప్పాడని నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయని చెప్పాడని.. లొకేషన్ షేర్ చేశాడని నివేదిత వెల్లడించారు. మేము వెళ్లి చూసే సరికి అక్కడ నుజ్జు నుజ్జు అయిన కారు మాత్రమే ఉందని లాస్య సోదరి నివేదిత తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు