Lasya Nandita: లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..

ఆమె ఆరు దంతాలు ఊడిపోయాయని చెప్పారు. ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయిందని వివరించారు.

Lasya Nandita: లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..

BRS MLA Lasya Nanditha

Updated On : February 23, 2024 / 3:55 PM IST

Lasya Nandita: కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకురాలు లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తేల్చారు. ఆమె ఆరు దంతాలు ఊడిపోయాయని చెప్పారు. ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయిందని వివరించారు.

లాస్య నందిత తలకు బలమైన గాయం అయిందని చెప్పారు. ఆమె శరీరంలో ఎముకలకు కొద్దిగా నష్టం జరిగిందని, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాగా, ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్ నుంచి ఆమె సదాశివపేటకు వెళ్తున్న సమయంలో పటాన్‌చెరు ఓఆర్ఆర్‌పై కారు ప్రమాదానికి గురైంది. లాస్య నందిత అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు. లాస్య నందితకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆప్త మిత్రురాలికి కోల్పోయా: హేమ శ్యామల
లాస్య నందిత మృతి పట్ల సీతాఫల్ మండి కార్పొరేటర్ లాస్య నందిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆప్త మిత్రురాలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని హేమ ట్వీట్ చేశారు.

 Read Also: లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి