Fashion Show Event Ramp Walk: నోయిడా ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి..ఇనుప స్తంభం పడి మోడల్ మృతి

నోయిడా ఫిలింసిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్‌లో ఇనుప స్తంభం పడి 24 ఏళ్ల మోడల్ మరణించిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ 24 ఏళ్ల మోడల్ అయిన వంశిక చోప్రా ప్రాణాలు కోల్పోయింది.

Fashion Show Event Ramp Walk: నోయిడా ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి..ఇనుప స్తంభం పడి మోడల్ మృతి

Fashion Show Event

Updated On : June 12, 2023 / 8:58 AM IST

Fashion Show Event Ramp Walk: నోయిడా ఫిలింసిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్‌లో ఇనుప స్తంభం పడి 24 ఏళ్ల మోడల్ మరణించిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నోయిడా ఫిల్మ్ సిటీలో(Noida Film City area) ఆదివారం ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ 24 ఏళ్ల మోడల్ అయిన వంశిక చోప్రా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Cyclone Biparjoy intensifies: మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ తుపాన్..గుజరాత్‌లో తీరం దాటే అవకాశం

లైట్ల కాంతుల్లో మోడల్ వంశిక చోప్రా ర్యాంప్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా లైట్ల స్తంభం వారిపై పడింది. దీంతో మోడల్ వంశిక అక్కడికక్కడే మరణించింది. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వంశిక చోప్రా, గాయపడిన వ్యక్తి బాబీ రాజ్ ఫ్యాషన్ షోలో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

US restaurant launches Modi ji thali:ప్రధాని మోదీ అమెరికా పర్యటన..యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి మోడల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.రెండు కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఫ్యాషన్ షోలో ఇనుప స్తంభం పడిపోవడం వల్ల మోడల్ వంశిక చోప్రా మరణించింది. మృతదేహానికి సంబంధించిన పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని నోయిడా అదనపు డీసీపీ శక్తి అవస్థి చెప్పారు.