కూతురిని కత్తితో పొడిచి తల్లి ఆత్మహత్య

  • Publish Date - April 8, 2019 / 02:15 AM IST

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో దారుణం జరిగింది. తన సొంత కూతురును కత్తితో పొడిచి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. తన తొమ్మిదేళ్ల కూతురు సింధును తల్లి కత్తితో పొడిచి చంపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.