×
Ad

Sanitary Pads Stolen : ప్రేయసి కోసం శానిటరీ ప్యాడ్‌లు దొంగతనం చేసిన ప్రియుడు

ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

  • Published On : October 20, 2021 / 08:52 AM IST

Sanitary Pads Stolen

Sanitary Pads Stolen : ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.  బైతూల్ నగరానికి చెందిన అమన్ అనే యువకుడు నర్సింగ్ కోర్స్ చదువుతున్నాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయిని సినిమాలు, షాపింగ్ లు అంటూ షికార్లకు తీసుకు వెళ్లేవాడు. ఆ ఖర్చులు భరించటం కోసం ఒక మెడికల్ షాపులో పార్ట్ టైం జాబ్ చేయటం మొదలెట్టాడు.

తక్కువ కాలంలోనే యజమానికి నమ్మకస్తుడైన పనివాడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెడికల్ షాపు యజమాని ముస్లిం కావటంతో నమాజు కు   వెళ్లేప్పుడు షాపును అమన్ కు అప్పచెప్పి వెళ్లేవాడు. కొన్ని రోజులకు యజమాని  షాపులో స్టాక్ వాల్యూ   వేసుకుంటే తేడా రావటం గుర్తించాడు.  అతను చెల్లించాల్సిన బిల్లులు ఎక్కువ ఉండటం… స్టాక్ తక్కువ ఉండటంతో అనుమానం వచ్చింది.

వెంటనే సీసీటీవీ ఫుటేజి పరిశీలించాడు. అందులో షాకింగ్ విషయాలను చూసి బిత్తరపోయాడు. తాను షాపులో లేనప్పుడు అమన్ క్యాష్ దొంగిలించేవాడు. క్యాష్ లేని సమయంలో సరుకులు అమ్మి ఆ డబ్బులు జేబులే వేసుకునే వాడు. ఇంకొన్ని వీడియోలు చూడగా అమన్ షాపులోని సరుకులు సైతం దొంగిలించటం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియురాలి కోసం శానిటరీ ప్యాడ్ లను సైతం దొంగిలించాడు.
Also Read : Money scam: మనీ మోసం.. విద్యార్ధులే టార్గెట్.. రూ.10వేలు కడితే.. రూ.1.5 లక్షలు!
ఇవన్నీ చూసిన షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమన్ ను అదుపులోకి తీసుకని ప్రశ్నించారు. తన గర్ల్ ఫ్రెండ్ కు షాపింగ్ పిచ్చి అని అందుకోసం తనకు డబ్బులు అవసరం అయ్యాయని అందుకే దొంగతనం చేశానని చెప్పాడు. పోలీసులు అమన్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.