Mumbai based teacher loses Rs 80,000 in a new Provident Fund Scam
Provident Fund Scam : భారత్‌లో ఆన్‌లైన్ స్కామ్‌లు (Online Scams) భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ అనేక కొత్త సైబర్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే.. ముంబైకి చెందిన ఒక జిమ్ యజమాని జ్యోతిష్యుడిలా నమ్మించి ఒక వ్యక్తి నుంచి రూ.1.99 లక్షలు కొట్టేశాడు. మరో 53 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించి రూ.87వేలు పోగొట్టుకుంది. OLX యాప్ ద్వారా జ్యూసర్‌ను విక్రయించేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి స్కామర్ చేతిలో రూ.1.14 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు, ప్రావిడెంట్ ఫండ్ (PF) అనే కొత్త స్కామ్‌లో ముంబైకి చెందిన యువ ఉపాధ్యాయుడు రూ. 80వేలు పొగొట్టుకున్నాడని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.
ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న 32 ఏళ్ల టీచర్ ఆన్‌లైన్‌లో PF ఆఫీస్ కాంటాక్ట్ నంబర్ కోసం సెర్చ్ చేశారు. నివేదిక ప్రకారం.. సైబర్ మోసగాడితో అతడికి పరిచయం ఏర్పడింది. అప్పుడు స్కామర్ తాను PF ఆఫీస్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నాడు. అలా ఆ టీచర్‌ను నమ్మించి రూ. 80వేలు కాజేశాడు.
నిందితులు బాధితుడిని ఎయిర్‌డ్రాయిడ్ (AirDroid) యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగారు. అది నమ్మిన బాధితుడు తన ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయగానే సైబర్ మోసగాళ్లకు రిమోట్ యాక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత, మోసగాడు బాధితుడి ఫోన్ యాప్‌లో సీక్రెట్ MPINతో పాటు బ్యాంక్ అకౌంటు వివరాలను ఎంటర్ చేశాడు.
Mumbai based teacher loses Rs 80,000 in a new Provident Fund Scam
స్కామర్‌కు బ్యాంకు యాక్సెస్ లభించగానే.. 16 అనధికార లావాదేవీలు చేసి.. అకౌంట్లో నుంచి రూ.80వేల వరకు బదిలీ చేశాడు. ఈ సంఘటన గత వారమే జరిగింది. బాధితుడు ఏప్రిల్ 6న NRI కోస్టల్ పోలీస్ స్టేషన్‌లో FIR దాఖలు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి లేదా బ్యాంకర్‌గా లేదా ఏదైనా ప్రభుత్వ అధికారిగా నమ్మిస్తూ అడిగే ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని యూజర్లకు సైబర్ పోలీసులు సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో ప్రతిదానికీ అధికారికంగా వెరిఫైడ్ యాప్‌లు ఉన్నాయి. మీ ఫోన్‌లో ఏదైనా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
పీఎఫ్ ప్రాసెస్ విషయంలో అవగాహన లేని వినియోగదారులు ప్రభుత్వ అధికారిక EPFO వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు. ఈ సైట్‌లో తమ ప్రాంతంలోని EPFO ఆఫీసును కూడా గుర్తించవచ్చు. మీరు వెబ్‌సైట్‌ను విజిట్ చేసి స్క్రీన్‌పై లెఫ్ట్ టాప్ కార్నర్‌లో Services అనే ట్యాబ్‌కు వెళ్లాలి. ఇక్కడ, మీరు ‘Locate an EPFO Office’ అనే ఆప్షన్ గమనించవచ్చు. మీరు దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు లొకేషన్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. మీరు మీ ప్రాంతంలోని EPFO కార్యాలయాన్ని గుర్తించడానికి రాష్ట్ర, జిల్లా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ప్రావిడెంట్ ఫండ్, ఆధార్ కార్డ్ వంటి అన్ని విషయాలకు సంబంధించి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. మీరు ఆన్‌లైన్‌లో లేదా మరేదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే.. విశ్వసనీయ లేదా తెలిసిన సోర్స్ మాత్రమే ఉపయోగించాలి. వాట్సాప్ లేదా ఇమెయిల్‌లు లేదా టెలిగ్రామ్‌లో మీకు లభించే ఉద్యోగ అవకాశాలను నమ్మవద్దు అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. అదిరే ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతంటే?