ప్రేమ పెళ్లి చేసుకుందని.. ముగ్గురిని చంపి ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 02:55 PM IST
ప్రేమ పెళ్లి చేసుకుందని.. ముగ్గురిని చంపి ఆత్మహత్య

Updated On : October 13, 2019 / 2:55 PM IST

కామారెడ్డి జిల్లా దోమకొండలో ముగ్గురిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న బందెల రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని హత్య చేసిన తర్వాత రవి గొంతుకోసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చెరువులో రవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య కుమార్తె లత ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఈ విషయంలో అన్న బాలయ్యతో సోదరుడు రవి అనేక సార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు పెరిగాయి. నిందితుడు రవి పక్కా ప్లాన్ ప్రకారం బాలయ్య, చందన, లతను దోమకొండలోని మల్లయ్య దేవాలయానికి రప్పించాడు. అక్కడ వారిని హత్యచేసి పరారయిన రవి .. నేడు శవమై తేలాడు.