Dead Body In Public Water Tank : హత్యా? ఆత్మహత్యా? వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ.. అసలేం జరిగింది..

హైదరాబాద్ లో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీ కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎవరన్నది గుర్తించారు.

Dead Body In Public Water Tank : హైదరాబాద్ లో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీ కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎవరన్నది గుర్తించారు.

అతడి పేరు కిశోర్. చిక్కడపల్లిలోని అంబేద్కర్ నగర్ వాసి. రెండు వారాల కిందట కిశోర్ కనిపించడం లేదంటూ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. వాటర్ ట్యాంకు నుంచి తెలికితీసిన మృతదేహం అతడిదేనని గుర్తించారు. అతడి చెప్పుల ఆధారంగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా, అతడి మరణం ఎలా సంభవించింది? అన్నది తేలాల్సి ఉంది.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

ముషీరాబాద్ హరినగర్ రిసాల గడ్డ ప్రాంతంలోని జలమండలి వాటర్ ట్యాంకులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. నాలుగు రోజుల కిందట ఇంట్లో గొడవపడి కిషోర్ బయటికి వెళ్లిపోయాడని పోలీసులు చెబుతున్నారు. నగరంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కిషోర్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

నగరంలోని చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంతో మృతదేహం కిషోర్‌దిగా తేలింది. నిన్న(డిసెంబర్ 7,2021) సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కిషోర్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో వాటర్ ట్యాంకులో లభ్యమైంది. వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి షాక్ తిన్నారు. వెంటనే జలమండలి అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని బయటికి తీయించారు.

Bipin Rawat : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!

కాగా, మృతదేహం కిషోర్‌దిగా గుర్తించినప్పటికీ ఎలా చనిపోయాడనేది తేలాల్సి ఉంది. వాటర్ ట్యాంకు చాలా ఎత్తులో ఉంది. వాటర్ ట్యాంకుపై మద్యం తాగిన ఆనవాళ్లున్నాయని చెబుతున్నారు. వాటర్ వర్క్స్ సిబ్బంది వచ్చి ట్యాంకు మూత తీసి లోపలికి వెళ్తుండగా డెడ్‌బాడీని గుర్తించారు. ఎవరైనా హత్య చేసి ట్యాంకులో పడేశారా? లేక ఇంట్లో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ట్యాంక్ మూతలు మూసి ఉండడంతో ఎవరైనా హత్య చేసి పడేసి ఉంటారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

మరోవైపు జలమండలి అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు, వాటర్ వర్క్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. కుళ్లిపోయిన మృతదేహం ఉన్న నీటిని పలు ప్రాంతాలకు సరఫరా చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నీరు దుర్వాసన వస్తుండడం.. వెంట్రుకలు, చిన్నచిన్న మాంసం ముక్కల్లాంటి పదార్థాలు వస్తున్నాయని స్థానికులు సమాచారం ఇచ్చిన తర్వాతే వాటర్ వర్క్స్ సిబ్బంది వాటర్ ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మృతదేహం ఉన్న సంగతి బయటపడింది. కాగా, ఆ నీటిని తాగిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఏమైనా అవుతుందేమోనని కంగారుపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు